Thursday, January 23, 2025

పెండింగ్‌లో 3.5 లక్షల స్మార్టు కార్డులు

- Advertisement -
- Advertisement -

ఇబ్బంది పడుతున్న వాహనదారులు

3.5 Lakh smart cards are pending

మన తెలంగాణ/సిటీబ్యూరో : గతంలో రవాణశాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీలు ఆయా వాహనదారులకు అందాలంటే 15 నుంచి 20 రోజుల్లో వచ్చేవి. కాని ప్రస్తుత పరిస్థితికి ఇందుకు పూర్తిభిన్నంగా ఉంది. నెలలు దాటుతున్నా సంబంధిత ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు గడువు ముగిసినా రాక పోవడంతో వారు ట్రాఫిక్ అధికారులకు పెద్ద ఎత్తన ఛలానాలు చెల్లించుకోవాల్సి రావడ ం తో వారి జేబులకు చిల్లుపడుతుండటంతో వారు ఆర్థికం గా నష్టపోతున్నారు. వాహనదారులు నుంచి ఆయా సర్వీసుల రూపంలో కోట్లరూపాయలు రవాణశాఖకు వ చ్చి చేరుతున్నా వాహనదారులకు సంతృప్తికరమైన సేవ లు అందించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా స్మార్టు కార్డులు ( ఆర్సీలు, డ్రైవింగ్ లెసెన్స్‌లు) 3.5 లక్షల పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. గత రెండు నెలలుగా స్మార్టు కార్డులు అందక పోవడంతో వాహనదారులు సంబంధిత రవాణశాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు చూస్తున్నారు. కేవలం అధికారులు నిర్ల క్షం, బాధ్యతారాహిత్యం కారణంగానే స్మార్టు కార్డుల కోరత ఏర్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. వాహనదారుల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు అధికారులు తాత్కాలింగా ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకుంటుండటంతో సమస్య మాత్రం పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదు.

వాహనం నడిపే ప్రతి వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు సదరు వాహన ఆర్సీ కూడా ముఖ్యమే. ఇవేవి లేకుండా ఆయా వాహనాలను నడిపితే మోటారు వాహన చట్టం కింద పెద్ద ఎత్తన ఛలనాలు చెల్లించాల్సి రవాడమే కాకు ండా కొన్ని సందర్భాల్లో సదరువాహనాన్ని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో వారు సదరు వాహనానికి డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీలను పెద్ద మొత్తంలో చెల్లించి తీసుకుంటారు. ఈ విధంగా వానహదారులు చెల్లించడంతో రవాణశాఖకు రూ.100 కోట్లు ఆదాయం సమూకూరుతుంది. ఒక స్మా ర్టు కార్డు స్పీడ్ పోస్టు చేసేందుకు రూ.30 చొప్పున సదరు చార్జీలను ముందు చెల్లిస్తారు. స్మార్డు కార్డుల తయారీ, పంపిణీ ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. సదరు సంస్థ నుంచి కార్డులు అందితేనే రవాణశాఖ కార్యాలయానికి కార్డులు అందుతాయి. ఆయా ప్రైవేట్ సంస్థకు సకాలంలో నిదులు అందక పోవడంతో కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. కేవలం రూ. 25 నుంచి 30 కోట్లతో పరిష్కారం అయ్యే సమస్యలను అధికారులు సాగదీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

కార్డుల కొరతను శాశ్వతంగా పరిష్కరించే అవకాశం ఉ న్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప లువురు ఆరోపిస్తున్నారు. ఆదార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డుల తరహాలో సదరు కార్డులను ఈ సేవా,మీ సేవా కేంద్రాల ద్వారా పొందే విధంగా ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. లేదా స్మార్టు కార్డుల పంపిణీ తరహాలో కార్డుల పంపిణీ బాధ్యతను ఒక సంస్థకు అప్పగిస్తే పరిష్కారం లభిస్తుందం టున్నారు. ఆన్‌ల పత్రాలకు చట్టబద్దమైన ప్రామాణికాన్ని కల్పించడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని చెబు తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News