Sunday, November 24, 2024

ఇంటి నుంచే ఓటు వేసిన 3.50 లక్షల మంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇటీవల ఎన్నికలు జరిగిన 11 రాష్ట్రాల్లో వికలాంగులకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ను ఎన్నికల సంఘం కల్పించింది. ఈ వెసులు బాటును వికలాంగులు, వృద్ధులు మొత్తం 3.30 లక్షల మంది వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక తదితర 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా 3.30 లక్షల మంది వికలాంగులు,

వయోవృద్ధులు తమ ఇంటి వద్ద నుంచే ఓటు వేయగలిగారు. వీరిలో 2.6 లక్షల మంది 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్లు కాగా, 70 వేల మంది వికలాంగులు ఉన్నారు. వీరంతా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటు వేశారు. సీనియర్ సిటిజెన్లకు ముఖ్యంగా వందేళ్లు వయసున్న వారికి తమ ఓటు వినియోగించుకున్నందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కృతజ్ఞతలు తెలియజేసింది. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యక్తిగతంగా దాదాపు 2.5 లక్షల మంది శతాబ్ది ఓటర్లకు కృతజ్ఞతా పూర్వకంగా లేఖలు రాశారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపర్చడంలో కీలక పాత్ర వహించారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News