Sunday, December 22, 2024

3.79 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం: టిటిడి

- Advertisement -
- Advertisement -

తిరుమ‌ల‌: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 3.79 ల‌క్ష‌ల మంది భక్తుల‌కు స్వామివారి దర్శనం మరియు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడం జరిగింది.

తిరుమల ముఖ్యాంశాలు

శ్రీవారి ఆల‌యం:

3.79 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నంతో పాటు వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్య్స‌కార ప్రాంతాల నుండి ఈ నెల 13 నుండి 20వతేదీ వరకు 6,949 మందికి ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం, రవాణా, వసతి, ఆహారం టిటిడి కల్పించింది. అలిపిరి నడక మార్గం నుండి 26,420 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) 1.66 ల‌క్ష‌ల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 83 వేల మంది సర్వదర్శనం టైంస్లాట్, 15,465 మంది శ్రీవాణి ట్రస్టు, 7,917 మంది దాత‌లు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నారు. వర్చువల్ సేవ‌లు టికెట్లు కలిగిన (కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఊంజల్‌ సేవ) – 43,250 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు. మొత్తం 15.14 ల‌క్ష‌ల ల‌డ్డూలు భక్తుల‌కు అందించారు. శ్రీవారిక రూ.26.61 కోట్లు హుండీ కానుక‌లు వచ్చాయి.

నిఘా మరియు భద్రతా విభాగం :

500 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది విజిలెన్స్‌ మరియు సెక్యూరిటీ సిబ్బంది భక్తుల‌కు సేవందించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని వీడియో వాల్‌ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించారు. తిరుమలోని కౌంటర్లలో 2.05 ల‌క్ష‌ల‌ మంది భక్తుల ల‌గేజిని భద్రపరచడం జరిగింది. 69,117 వాహనాల్లో భక్తులు తిరుమల‌కు రావడం జరిగింది.

రిసెప్షన్‌:10 రోజుల‌కు కలిపి 42,809 గదుల‌ను భక్తులు పొందడం జరిగింది. ఇందుకోసం టిటిడికి సమకూరిన మొత్తం
రూ.4.68 కోట్లు.

కల్యాణకట్ట:తల‌నీ‌లాలు సమర్పించుకున్న భక్తుల‌ సంఖ్య 1.23 ల‌క్ష‌లు. 263 మంది మహిళా క్షురకులు, 851 మంది పురుష క్షురకుల‌తో కలిపి మొత్తం 1,114 మంది క్షురకులు 10 కల్యాణకట్టల్లో భక్తుల‌కు ఉచితంగా తల‌నీలాలు తీయడం జరిగింది.

అన్నప్రసాదం: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కలిపి 4.58 ల‌క్షల‌ భోజనాలు, అల్పాహారం అందించడమైనది. 14,643 మంది (వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే) భ‌క్తుల‌కు పాలు/టీ/కాఫీ అందించడమైనది.

ఐటి: టిటిడి ఐటి విభాగం అధునాతన పరిజ్ఞానంతో వేగవంతమైన సేవ‌లందించడం ద్వారా భక్తులు దర్శనం, వసతి ఇతర సేవల‌ను మరింత సౌకర్యవంతంగా పొందగలిగారు.

ఎపిఎస్‌ఆర్‌టిసి: ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమల‌కు 6,640 ట్రిప్పుల్లో 1.81 ల‌క్షల‌ మంది భక్తుల‌ను చేరవేశాయి. తిరుమల‌ నుంచి తిరుపతికి 6,256 ట్రిప్పుల్లో 1.84 ల‌క్షల‌ మంది భక్తుల‌ను చేరవేశాయి.

ఆరోగ్య విభాగం:

కాటేజీలు, యాత్రికుల‌ వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం 1100 మంది సిబ్బంది సేవల‌ను వినియోగించడమైనది. రోజుకు సరాసరి 4.25 టన్నుల‌ చెత్త తొల‌గింపు.

వైద్యం: వైద్యసేవ‌లు పొందిన భక్తుల‌ సంఖ్య 13,829

ఇంజనీరింగ్‌ విభాగం :

ఘాట్‌ రోడ్ల పునరుద్ధరణ:
గతేడాది నవంబరు 17, 18వ తేదీల్లో భారీవర్షాల కారణంగా భారీ కొండచరియలు విరిగిపడి తిరుమల రెండో ఘాట్‌ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. రూ.1.30 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి వైకుంఠ ఏకాదశి నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.60 కోట్లతో నడకమార్గం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

విపత్తుల నివారణ కరదీపిక:

వరదలు, కొండచరియలు విరిగి పడడం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వెంటనే స్పందించి భారీ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక (మాన్యువల్‌) రూపొందిస్తున్నారు.ఇందుకోసం కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించి ముందస్తు హెచ్చరికలు చేసే యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఉద్యానవన విభాగం:

 శ్రీవారి ఆల‌యంలో శోభాయమానంగా పుష్పాలంక‌ర‌ణ‌లు. ఇందుకోసం దాత‌ల స‌హ‌కారంతో 31 ట‌న్నుల సంప్ర‌దాయ పుష్పాలు, 3.5 ల‌క్ష‌ల క‌ట్ ఫ్ల‌వ‌ర్లు వినియోగం.

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమైన ధార్మిక కార్యక్రమాలు:

జనవరి 13వ తేదీ సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం.జ‌న‌వ‌రి 14వ తేదీ నుండి తిరుమ‌ల‌లో విష్ణు సహస్ర నామ పారాయణం ప్రారంభ‌మైంది.

3.79 lakh Devotees visit Tirumala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News