- Advertisement -
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ పంజావిసరడంతో విలవిలలాడిపోతుంది. మహానగరాలు గజగజ వణికిపోతున్నాయి. ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, కోల్కతా వంటి నగరాలలో ఆస్పత్రులు శవాలదిబ్బలుగా మారాయి. ఆస్పత్రులలో ఎటుచూసిన శవాలతో నిండిపోయాయి. గత 24 గంటల్లో 3.86 లక్షల కేసులు నమోదుకాగా 3498 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో మొత్త కేసుల సంఖ్య 1.87 కోట్లకు చేరుకోగా 2.08 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1.53 కోట్ల మంది కోలుకోగా 31.64 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు 28.4 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. దేశంలో 15.22 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
- Advertisement -