- Advertisement -
హైదరాబాద్: నాగార్జునసాగర్‌లో జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌లోకి ఇన్‌ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 28,747 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 546.6 అడుగులుగా ఉంది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 312.5 టిఎంసిలుండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 201.91 టిఎంసిలుగా ఉంది. శుక్రవారం సాయంత్రం నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు నీటిని విడుదల చేయనున్నారు.
- Advertisement -