Sunday, December 22, 2024

మహిళా సంఘాల కోసం హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాలు భూమి: భట్టి

- Advertisement -
- Advertisement -

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుతో దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలువబోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ఫోకస్ పెట్టి బడ్జెట్‌లో పెద్దపీట వేశామన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా ఉండబోతుందన్నారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు పూర్తయిందని, నిధులను సైతం కేటాయించామని ఆయన తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని తమ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులను కేటాయించిందన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు 20 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని, వారు చెల్లించాల్సిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని, మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి మైక్రో స్మాల్ ఇండస్ట్రీలను వారికి కేటాయించబోతున్నామని ఆయన తెలిపారు.

ప్రజా ప్రభుత్వం వారికి అందించే ప్రోత్సాహకాల వల్ల మహిళలు ఆర్థిక పరిపుష్టి తో ఆర్థిక సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను మహాలక్ష్మిలుగా కొలుస్తామని, డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాలు భూమిని మహిళల కోసం కేటాయించామని, రాష్ట్రంలో మహిళల కోసం సమానమైన దృష్టిని తమ ప్రభుత్వం కేంద్రీకరించి వారి అభివృద్ధికి పాటుపడుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News