Monday, January 20, 2025

కువైట్ అగ్నిప్రమాదంలో ముగ్గురు ఎపి వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

కువైట్ దేశంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయినవారిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన లోకనాథం, పశ్చిమ గోదావకి జిల్లా అన్నదేవరపాడుకు చెందిన ఈశ్వరుడు, ఖండవల్లికి చెందిన మెల్లోటి సత్యనారాయణలు అగ్ని ప్రమాదంలో మృతి చెందారని.. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతదేహాలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానంలో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు భవనం పై నుంచి స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నారని చెప్పారు.

కాగా, గత బుధవారం తెల్లవారుజామున కువైట్‌లోని మంగ్‌ఫలోని కార్మికులు ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా.. ఇందులో 45 మంది భారతీయులు ఉన్నారని కువైట్‌ అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News