- Advertisement -
హైదరాబాద్: బాచూపల్లి, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత (ద్రవ రూపంలో ఉన్న గంజాయి)హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను శనివారం ఉదయం బాలానగర్, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు.
వారి వద్ద నుండి 5 ఎంఎల్ తో ఉన్న 300(230 బాచుపల్లి, 70 సనత్ నగర్)బాటిళ్ళ నిషేధిత హాష్ ఆయిల్ తో పాటు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక కారు, రూ.4వేల నగదును పోలీసులు స్వాధీన చేసుకున్నారు. అనంతరం ముగ్గురు నిందుతులని రిమాండ్ తరలించామని, మరోకరు పరారీలో ఉన్నట్లు బాలానగర్ డిసిపి శ్రీనివాస్ రావు తెలిపారు.
- Advertisement -