సిటిబ్యూరోః అక్రమంగా ఒంటెలను కలిగి ఉన్న ముగ్గురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల వద్ద నుంచి నాలుగు ఒంటెలు, కోసే కత్తులు, వేయింగ్ స్కేల్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కర్నాటక రాష్ట్రం, బీదర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ బీఫ్ షాపు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్, గోల్కొండకు చెందిన మహ్మద్ సల్మాన్ మటన్ షాపులో పనిచేస్తున్నాడు. టోలీచౌకికి చెందిన సిరాజ్ ఖాన్ కలిసి ఒంటె మాంసం విక్రయించేందుకు ప్లాన్ వేశారు.
గతంలోనే మహ్మద్ ఇస్మాయిల్ బీఫ్ షాపులో బుచర్‌గా పనిచేశారు, తర్వాత బెస్ట్ బీఫ్ షాపును పారామౌంట్ కాలనీలో నిర్వహిస్తున్నాడు. నిందితుడు ఒంటె మాంసం విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన ఇస్మాయిల్ మధ్యప్రదేశ్‌కు చెందిన శ్యాంను సంప్రదించాడు. మూడు నెలల క్రితం అతడి వద్ద నుంచి ఏడు ఒంటెలను కొనుగోలు చేశాడు. వాటిలో మూడింటిని కోసం అవసరం ఉన్న వారికి రూ.400కిలో చొప్పున మాంసం విక్రయించాడు. మిగతా నాలుగు ఒంటెలను తన వద్ద ఉంచుకున్నారు. వాటిని హకీంకుంటలోని ఓపెన్ ప్లేస్‌లో