Thursday, January 23, 2025

హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
12 గ్రాముల ఎండిఎంఏ, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టిఎస్ నాబ్, దబీర్‌పుర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12 గ్రాముల ఎండిఎంఏ, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.2లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం… యూసుఫ్‌గూడకు చెందిన మిర్జా అస్ఘర్ అలీ బైగ్, మహ్మద్ సాజిద్, మహ్మద్ అబ్దుల్ సలాం ఖాన్ అలియాస్ ఫైజన్ కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు.

ముగ్గురు నిందితులు రెండేళ్ల నుంచి తెలిసిన వారి వద్ద తక్కువ ధరకు భారీ మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి డ్రగ్స్ విక్రయించేందుకు రాజియా మజీద్ వద్దకు వస్తున్నట్లు టిఎస్ నాబ్, దబీర్‌పుర పోలీసులకు తెలిసింది. అక్కడికి చేరుకుని మాటువేసిన పోలీసులు నిందితులు రాగానే పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దబీర్‌పుర పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News