Thursday, January 23, 2025

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని వేరు వేరు సంఘటనలో ముగ్గురు గాంజా కలిగిన వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు పెద్ద షాపూర్ మరియు చిన్న గోల్కొండ గ్రామంలో పెద్ద షాపూర్ వద్ద ఓ వ్యక్తి వద్ద గంజాయి ఉందంటూ ఇచ్చిన పక్కా సమాచారంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద షాపూర్ చిన్న గోల్కొండ గ్రామాలలో షాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి వద్ద గంజాయి కలిగిన సంచి తో ఓ వ్యక్తి ఉన్నాడని సమాచారం రాగా అక్కడికి చేరుకొని ఎరుపు రంగు సంచి కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద 250 గ్రాముల గాంజా ఉన్నట్టు తెలిపిన పోలీసులు ఆ యొక్క వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా తన పేరు సభావత్ శివ(20) తండ్రి గోపాల్ వృత్తి వ్యవసాయం మహేశ్వరం మండల్ పడమటి తండా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు గాంజా సంచి తో పాటు వివో మొబైల్ ను స్వాధీనం చేసుకున్న

పోలీసులు నిషేధించబడిన గాంజాను అక్రమంగా కలిగి ఉన్నటువంటి శివ పై కేసు నమోదు చేసి సెక్షన్ 474,475 కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అదే తరహాలో చిన్న గోల్కొండ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీపై వారి చేతిలో చిన్న బ్యాగు కలిగి ఉన్నారని బ్యాగులు తనిఖీ చేయగా సుమారు 350 గ్రాముల నిషేధించబడిన గాంజా కలిగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు వారి యొక్క వివరాలు ఒకరు పవన్ కళ్యాణ్ 26తండ్రి ఇంద్రసేన పెయింటర్ గా పనిచేస్తున్నాడు మరో వ్యక్తి గోరే వెంకటేష్28 ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు మీరు ఇద్దరి నివాసం చిన్న గోల్కొండ గ్రామం కాగా వీరిద్దరి వద్ద 350 గ్రాముల గంజాను స్వాధీన పరుచుకొని వారు ఉపయోగించిన మొబైల్స్ హోండా యాక్టివా స్వాధీన పరుచుకొని నిషేధించబడిన గాంజాను అక్రమ కలిగి ఉన్నటువంటి వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు నిషేధిత గంజాను కలిగి ఉన్న విక్రయించిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు పోలీసులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News