- Advertisement -
అనంతపురం: జిల్లాలోని గుంతకల్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. ఆదివారం ఉదయం రైల్వే పార్శిల్ ఆఫీసు దగ్గర డ్రగ్స్ పంచుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.6.15లక్షల విలువైన 20.64 గ్రాముల కొకైన్, మెఫిడ్రిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
3 Arrested in Anantapur for sale of Drugs
- Advertisement -