మంచిర్యాల తల్లీకూతుళ్ల హత్యకేసులో ముగ్గురు అరెస్టు
సాక్షాలు దొరకకుండా పకడ్బందీ ప్రణాళిక, అనుమానం రాకుండా పరిచయంలేని వాళ్లకు ప్రియుడి సుపారీ హతమార్చి నగలతో ఉడాయించిన కిరాయి హంతకులు
మన తెలంగాణ/మంచిర్యాలప్రతినిధి: ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన యువతిని అపారంగా ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న తరువాత అపర రాక్షసునిగా మారి అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా పుట్టింటికి వెళ్లిన భార్యను కొందరు మిత్రుల ద్వారా అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు. భార్యతో పాటు అడ్డుగా ఉన్న అత్తను కూడా మెడకు తాడు బిగించి హతమార్చిన సంఘటన మంచిర్యాలలో కలకలం రేపింది. తల్లీకూతుళ్ల జంట హత్య కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. కేవలం పది రోజుల్లోనే జరిగిన ఈ హత్యను పోలీసులు చాకచక్యంగా చేధించారు. సాక్షం దొరకకుండా పకడ్బందీగా చేసిన హత్యలను సాంకేతిక పరిజ్ఞానంతో 24గంటల్లోనే నిందితులను గుర్తించారు. ఒకరికొక్కరు పరిచయం లేకపోయినా వాట్సాప్ కాల్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్ ద్వారా మాట్లాడుకొని కిరాయి హత్యలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆన్‌లైన్ పబ్జీ గేమ్‌తో పరిచయం ప్రేమగామారి పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకోగా ఈ హత్య సుపారి వరకు వెళ్లింది. పెళ్లికి ముందు అపర ప్రేమికులుగా ఉన్న పెళ్లి తరువాత అపర రాక్షసునిగా మారి భార్యతో పాటు అత్తను హత్య చేసిన ఉదాంతాన్ని పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం కమిషనర్ సత్యనారాయణ వివరాలను వెళ్లడించారు. జిల్లా కేంద్రంలోని బృందావన్‌కాలనీకి చెందిన విజయలక్ష్మి, రవీనాలు ఈనెల 18న హత్యకు గురికాగా విజయలక్ష్మి కుమారుని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఈ కేసులో రవీనా భర్త నిజామాబాద్‌జిల్లా బోధన్ పట్టణంలోని చక్కర్‌నగర్ చెందిన కామెరు అరుణ్‌కుమార్‌తో పాటు యుట్యూబ్ ద్వారా పరిచయమైన గుంటూర్ జిల్లా అమరవతికి చెందిన జుజ్జవరపు రోశయ్య(అలియాస్‌బిట్టు), కృష్ణా జిల్లా మోతినేని మండలం పెద్దప్రోలకుచెందిన దండం వెంకటసుబ్బారావు(అలియాస్ సుబ్బు)లను అరెస్టు చేసి హత్యకు సంబంధించి నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.యుటూబ్ చానల్‌లో వచ్చిన ప్రకటన ద్వారా అరుణ్‌కుమార్ ఆకర్షితుడై మంచిర్యాలలో ఉంటున్న తన భార్య రవీనా, ఆమె తల్లి విజయలక్ష్మిలను హతమార్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో వారు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా అంత డబ్బులు నావద్ద లేవని, వారిని హత్య చేసిన అనంతరం డబ్బులు ఇస్తానని చెప్పడంతో వారు హత్య చేసేందుకు పథకాన్ని రూపొందించారు. ఈనెల 16 సుబ్బు, బిట్టులను మంచిర్యాలకు రావాలని చెప్పిన అరుణ్‌కుమార్ 17న మంచిర్యాల పట్టణానికి రాగానే స్థానికంగా ఒక లాడ్జిని ఇప్పించి హత్యకు ప్లాన్ చేశారన్నారు. హత్యకుముందే రెక్కి నిర్వహించి అరుణ్ తనభార్య, అత్త ఉండే ఇంటి అడ్రాస్ చూపించాడని ఈమేరకు వారు హత్యకు పాల్పడినారన్నారు. అత్త విజయలక్ష్మి ప్రతినిత్యం నల్ల నీటి కోసం 4 నుండి 5 గంటల మధ్య నిద్ర లేస్తుందని తెలుపగా హత్య జరిగిన రోజు ఉదయం 5 గంటల సమయంలో నల్ల నీరు వస్తున్న శబ్దం విని నీటి కోసం బయటకు రాగా ఆమెపై దాడి చేసి మెడకు తాడుతో బిగించి హత్య చేశారన్నారు.
ఇంతలో ఆమె కూతరు రవీనా బెడ్‌రూం నుంచి లేచివచ్చి అరుస్తుండగా అరుణ్ వెల్లి నోరు మూశారని, విజయలని చంపిన తరువాత బిట్టు, సుబ్బు నేరుగా బెడ్‌రూంలోకి వచ్చి రవీనా మెడచుట్టూ తాడుతో ఇద్దరు కలసి తాడును బిగించి చంపిన అనంతరం విజయలక్ష్మిమృతదేహాన్ని తీసుకువచ్చి బెడ్‌రూంలో పడేసి ఆమె మెడలో ఉన్న చైన్, ఉంగరాలు తీసుకొని పారిపోయారన్నారు. మొదట ఒప్పందం ప్రకారం రూ.10 లక్షలు ఇవ్వాలని అనీల్‌కుమార్‌కు సుబ్బు, బిట్టులు వార్నింగ్ ఇచ్చి పదిరోజులు గడువు ఇచ్చారని పేర్కొన్నారు. హత్య జరిగిన అనంతరం ఒక చానల్‌లో వస్తున్న వార్తలను చూసి అరుణ్‌కుమార్ పారిపోయేందుకు యత్నించగా మంగళవారం నిజామాబాద్ బస్టాండ్ వద్ద పోలీసులుపట్టుకొని మంచిర్యాలకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న మంచిర్యాల డిసిపి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఓఎస్‌డి శరత్ చంద్రపవార్, ఏసిపి అఖిల్‌మహాజన్, సిఐ ముత్తిలింగయ్య, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, దేవయ్య, ప్రవీణ్‌కుమార్,కానిస్టేబుల్స్ మహేందర్, నాగుల సురేందర్, పిడిఆర్ కానిస్టేబుల్ మైకాంత్, శ్రీనివాస్, సతీష్, భరత్‌లను సిపి సత్యనారాయణ అభినందించారు.
3 Arrested in mother and daughter murder case in Macherial