Thursday, January 23, 2025

గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఎపిలోని పట్టిసీమ వద్ద గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గోదావరిలోకి దిగిన సమయంలో నది లోతును సరిగా అంచనా వేయలేక, ప్రవాహానికి వారు కొట్టుకుపోయారు.

మొత్తం ఏడుగురు యువకులు గోదావరిలోకి స్నానానికి దిగగా, ముగ్గురు గల్లంతు అయ్యి, నలుగురు సురక్షితంగా గట్టు ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారిలో అరవింద్(20), ఎస్.కె. లక్ష్మణ్ (19), పెద్దిరెడ్డి రాంప్రసాద్(18)గా గుర్తించారు. గజ ఈతగాళ్ళ సాయంతో ఈ ముగ్గిరి మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా తూర్పు గోదావరి జిల్లా దోసపాడు గ్రామస్థులుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News