Monday, January 20, 2025

కృత్రిమ మేధకోసం 3 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దేశంలో మూడు అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ఎఐ)కోసం మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే 5జి సర్వీసులను ఉపయోగించుకునే అప్లికేషన్లను అభివృద్ధి చేయడం కోసం ఇంజనీరింగ్ కాలేజిల్లో 100 ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ‘మూడు అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో కృత్రిమ మేధ కోసం మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఒకటికన్నా ఎక్కువ విజ్ఞాన శాఖల్లో పరిశోధనలు నిర్వహించడంలో,అలాగే వ్యవసాయం, ఆరోగ్యం,సుస్థిర నగరాలకు చెందిన రంగాల్లో అత్యధునాతనమైన ప్లికేషన్లను అభివృద్ధి చేయడంతో పాటుగా పరిష్కరించదగిన సమస్యల పరిష్కారాలను కనుగొనడంతో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి’ అని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో తెలియజేశారు. 5జి సేవలను ఉపయోగించుకునే అప్లికేషన్లను అభివృద్ధి చేయడం కోసం వివిధ అథారిటీలు, రెగ్యులేటర్లు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థల తోడ్పాటుతో ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో 100 ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

ఏకలవ్య పాఠశాల్లో 38,000 సిబ్బంది నియామకం

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో భారీ సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ చెపారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 మంది ఉపాధ్యాయ, సహాయక సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూళ్లలో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు బోధనను అందించడమే లక్షంగా ఈ భారీ రిక్రూట్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News