Wednesday, January 22, 2025

నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమల్ల వద్ద గల మున్నేటిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…ఖమ్మం నగరం మమత హాస్పిటల్ వెనకాల నివాసం ఉంటున్న అముదాల చిరంజీవి కుమారులు అముదాల లోకేష్ (13), అముదాల హరీష్ (9), పక్కింటి అబ్బాయి బాణోత్ గణేష్‌లు తండ్రి అముదాల చిరంజీవి సమీపంలో గల దంసలాపురం వద్ద గల మున్నేరులో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో మున్నేరుపై హైవే పనులు జరుగుతున్నందున ఈత కొట్టేందుకు దిగారు.

వంతెన వద్ద పెద్దలోయి ఉన్న విషయాన్ని గమనించిన ముగురు చిన్నారులు ఆ లోయలో దూకి నీట మునిగారు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కాపాడబోయే సరికే అప్పటికి ఆ చిన్నారులు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న ట్రైనీ ఐసిఎస్, ఖమ్మం రూరల్ ఎస్‌ఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి గజ ఈతగాళ్ల ద్వారా శవాలు వెలికి తీయించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News