Sunday, December 22, 2024

3 కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణంపై కిషన్ రెడ్డి ప్రకటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల కోసం బిజెపి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి, బిజెపి తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలు, మహిళలు, యువత, రైతులను దృష్టిలో ఉంచుకుని బిజెపి ఎన్నికల మేనిఫెస్టో రూపొందించిందన్నారు.

రానున్న ఐదేళ్లలో 3 కోట్ల నూతన గృహాలు నిర్మిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. కేంద్రంలో బిజెపి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.  మోడీ మరోసారి ప్రధాని అవుతారన్నారు. తెలంగాణలో బిజెపి డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News