Wednesday, January 22, 2025

కారు లోయలో పడి ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో శనివారం తెల్లవారు జామున ఒక పర్వత రహదారిపై వెళుతున్న కారు జారిపోయి ఒక లోతైన లోయలో పడిపోగా ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు, మరి ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో తల్లి, ఆమె పది నెలల కుమారుడు కూడా ఉన్నారని వారు తెలిపారు. చామాలు మోఢ్ వద్ద ప్రమాదం జరిగింని, వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలియజేశారు.

ప్రైవేట్ కారు మాలికోట్ గ్రామం నుంచి చస్సనా వెళుతుండగా డ్రైవర్ శనివారం తెల్లవారు జామున అదుపు కోల్పోవడంతో ప్రమాదం జరిగింది. కుల్చా దేవి (27), ఆమె పది నెలల శిశువు నీరజ్ సింగ్, సమీప బంధువు సంధూర్ సింగ్ (23) అక్కడికక్కడే మరణించారు. దేవి భర్త చంకార్ సింగ్ (32), మరిది ధున్‌కర్ (19), సమీప బంధువు అజయ్ సింగ్ (18)లను స్థానిక వాలంటీర్లు రక్షించి ఆసుపత్రికి తరలించారని, అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసిందని అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News