Thursday, December 26, 2024

భారీ వర్షాలకు ఇంటి పైకప్పు కూలి కుటుంబం మృతి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : పంజాబ్ లోని ఫరీద్‌కోట్ జిల్లాలో కోట్కపుర ఏరియాలో భారీ వర్షాలకు బుధవారం తెల్లవారు జామున ఇంటిపై కప్పు కూలి కుటుంబం లోని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇంటి యజమాని, గర్భిణి అయిన ఆయన భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. వారంట్లో పడుకోడానికి వచ్చిన పొరుగింటి అమ్మాయి తీవ్రంగా గాయపడింది. పూర్వకాలం నాటి మిద్దె వర్షాలకు బాగా నాని ఒక్కసారి కూలిపోయిందని పోలీస్‌లు చెబుతున్నారు. ఆ కుటుంబం నిద్ర లోనే ఉండగా ఈ సంఘటన జరిగింది. మృతులు భార్యాభర్తలు ఇద్దరూ 30 ఏళ్ల వారని పోలీస్ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News