Saturday, December 21, 2024

సత్తెనపల్లిలో విషాద ఘటన.. డ్రైనేజీలో పడి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

3 died falling into drainage in Sattenapalli in AP

పల్నాడు: సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూ వినాయక రెస్టారెంట్ లో డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. డ్రైనేజ్‌ను క్లీన్ చేయించేందుకు బిల్డింగ్ యజమాని ఇద్దరు కూలీలతొ పనిచేయిస్తున్న సమయంలో ఒక్కసారిగా ముగ్గురు గుంతలో పడి మృతి చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గుంతలో నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

3 died falling into drainage in Sattenapalli in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News