Monday, December 23, 2024

రైలు ఢీకొని ముగ్గురు దివ్యాంగ బాలలు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: నగర శివార్లలోని ఉరపక్కం సమీపంలో లోకల్ రైలు ఢీకొని దివ్యాంగులైన ముగ్గురు పిల్లలు మరణించారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఘోర ఘటన మంగళవారం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

11, 15 సంవత్సరాల మధ్య వయస్కులైన ఈ ముగ్గురు పిల్లల స్వస్థలం కర్నాటక. రైలు పట్టాలు దాటుతుండగా లోకల్ రైలు ఢీకొనడంతో ఈ ముగ్గురు పిల్లలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో అన్నదమ్ములైన ఇద్దరు పిల్లలకు మూగ, చెవుడు ఉందని, మరో బాలుడు మాట్లాడలేడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరి తల్లిదండ్రులు చెన్నైలో దినసరి కార్మికులని ఆయన చెప్పారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News