Saturday, December 21, 2024

విషాదం.. కాలువలో మునిగి ముగ్గురు మృతి..

- Advertisement -
- Advertisement -

వైఎస్ఆర్: జిల్లాలోని వేంపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని అలవలపాడులో జిఎన్ఎస్ కాలువలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఆదివారం జిఎన్ఎస్ కాలువలో ఈతకు దిగిన సాయితేజ(6), సుశాంత్(8), జానయ్య(20)గా మునిగి ప్రాణాలు కోల్పోయారు.

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News