Monday, January 20, 2025

ముగ్గురు మాజీ ఖైదీలు శ్రీలంకకు పయనం

- Advertisement -
- Advertisement -

చెన్నై: సుప్రీంకోర్టు విడుదల చేసిన రెండేళ్ల తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షలు అనుభవించిన మాజీ ఖైదీలైన ముగ్గురు శ్రీలంక జాతీయులు బుధవారం తమ మాతృభూమికి బయల్దేరారు. రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి ఈ ముగ్గురు మూడు దశాబ్దాల కారాగార శిక్షను పూర్తి చేసుకున్నారు. వి మురుగన్ అలియాస్ శ్రీకరన్, జయకుమార్, బి రాబర్ట్ పయాస్ బుధవారం శ్రీలంక విమానంలో కొలంబోకు బయల్దేరి వెళ్లారని అధికారులు తెలిపారు.

మురుగన్‌తోపాటు ఇతరులకు ఇక్కడి శ్రీలంక హైకమిషన్ ప్రయాణ పత్రాలను మంజూరు చేసిందని, ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేటసన్ ఆఫీసు(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ తరలింపు ఉత్తర్వులు జారీచేస్తే వారు తమ స్దదేశానికి వెళ్లవచ్చని తమిళనాడు ప్రభుత్వం గత నెల మద్రాసు హైకోర్టుకు తెలియచేసింది. తనకు ఫోటో గుర్తింపు కార్డును సమకూర్చవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మురుగన్ ఇదివరకు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

2022 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ముగ్గురితోసహా మొత్తం ఏడుగురు జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల అనంతరం వారిని విరుచిరాపల్లిలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు. మంగళవారం రాత్రి ఈ ముగ్గురిని చైన్నైకు తీసుకువచ్చి బుధవారం ఉదయం కొలంబోకు పంపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News