హైదరాబాద్: ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద డిజైనర్ హబ్ గా అవతరించింది. దానికి కారణం భారతదేశంలోనే ప్రముఖ డిజైనర్లుగా పేరుపొందిన రాహుల్ మిశ్రా, అబ్రహాం, ఠాకూర్-సత్యపాల టీమ్ ఇక్కడ తమ ఫ్లాగ్ షిప్ స్టోర్స్ ని ప్రారంభించారు. ఇవి హైదరాబాద్ లోని సత్వా సిగ్నేచర్ టవర్ లో ఏర్పాటు చేశారు. ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ ఫ్యాషన్ ల్యాండ్‌స్కేప్ సరికొత్తగా పునర్నిర్వచించబడుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో లగ్జరీ రిటైల్ మరియు హై-ఎండ్ డిజైన్‌కు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుంది.
హైదరాబాద్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అందులోనూ వస్త్రాలపరంగా కూడా హైదరాబాద్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ నగరం గొప్ప సాంస్కృతిక వస్త్రాలతో నిండిన నగరం. కళాత్మకత, వస్త్రాలు మరియు చేతిపనులు ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచాయి. ఈ నగరం యొక్క శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వం మరియు సమకాలీన ఫ్యాషన్ రెండించి మిళితంగా ఉంటుంది. అందుకే భారతదేశంలోని ప్రముఖ డిజైనర్ ల యొక్క క్రియేటివ్ విజన్ ను దర్శించడానికి ఇది సరైన వేదికగా మారుతుంది.
అత్యంత కష్టమైన హస్తకళకు, వస్త్రాల యొక్క వినూత్న వినియోగానికి ప్రసిద్ధి చెందిన రాహుల్ మిశ్రా తన స్పెషల్ కలెక్షన్ ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆయనతో పాటు ప్రఖ్యాత అబ్రహం & ఠాకోర్ లేబుల్ వెనుక ఉన్న క్రియేటివ్ విజనరీస్ అయినటువంటి డేవిడ్ అబ్రహం, రాకేష్ ఠాకోర్ కూడా తమ స్పెషల్ కలెక్షన్ ను హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. డేవిడ్ అబ్రహాం, రాకేష్ ఠాకోర్ ని ముద్దుగా ‘మాస్టర్స్ ఆఫ్ మినిమలిజం’ అని పిలుస్తారు. వారు తమ క్రాఫ్ట్-ఆధారిత మరియు సమకాలీన డిజైన్లను వినియోగదారులకు అందిస్తారు. మరోవైపు ఐకానిక్ చీరలు, సమకాలీన ఫ్యూజన్ దుస్తులకు ప్రసిద్ధి చెందారు సత్య పాల్. సత్య పాల్ చీరలు స్టోర్ లైనప్‌కు గ్లామర్, గ్రేస్‌ను జోడిస్తాయి.
సినీ సెలబ్రిటీలు అయునటువంటి శోభితా ధూళిపాళ్ల, తమన్నా భాటియా, సుధా రెడ్డి, నిహారిక కొణిదెల, పింకీ రెడ్డి ఈ గ్రాండ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇంతమంది ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరైన దాన్ని బట్టి మనం గమనిస్తే… ఫ్యాషన్ ఇండస్ట్రీపై సెలబ్రిటీలకు, ప్రజలకు ఉన్న ఇష్టాన్ని మరోసారి చాటిచెప్పినట్లు అయ్యింది. సత్వ సిగ్నేచర్ టవర్‌లో ఈ ఫ్లాగ్ షిప్ స్టోర్స్ ని ప్రారంభించారు. దీనిద్వారా ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ప్రముఖ ప్లేయర్ గా హైదరాబాద్ ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన ముందడుగుగా చెప్పవచ్చు.