- Advertisement -
శ్రీనగర్: జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముగ్గురు జమ్మూ కశ్మీరు ప్రభుత్వ ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని పాలనా యంత్రాంగం సోమవారం విధుల నుంచి బర్తరఫ్ చేసింది.
ఈ ముగ్గురు ఉద్యోగులలో కశ్మీరు విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారి(పిఆర్‌ఓ) కూడా ఉన్నారు. కశ్మీరు యూనివర్సిటీ పిఆర్‌ఓ ఫహీమ్ లసాం, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగి మురావత్ హుస్సేన్ మీర్, పోలీసు కానిస్టేబుల్ అహ్మద్ థోకర్‌ను విధుల నుంచి బర్తరఫ్ చేశారు. రాష్ట్ర భద్రతకు ముప్పుగా పరిగణించిన పక్షంలో ప్రభుత్వ ఉద్యోగులను బర్తరఫ్ చేసే అధికారం రాజ్యాంగంలోని 311(2) అధికరణలోని సి నిబంధన ప్రకారం ఉంటుంది. జమ్మూ కశ్మీరు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చేసిన సిఫార్సుల మేరకు ముగ్గురు ఉద్యోగలను లెఫ్టినెంట్ గవర్నర్ బర్తరఫ్ చేశారు.
- Advertisement -