Sunday, December 22, 2024

యశ్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు?

- Advertisement -
- Advertisement -

కేజీఎఫ్‌ చిత్రం తరువాత కన్నడ స్టార్ హీరో యశ్ నటించనున్న చిత్రం ‘టాక్సిక్‌’. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్ తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. తాజాగా..  ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యష్‌ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా దాదాపు ఖరారైంది.

అయితే.. బాలీవుడ్‌ భామ హ్యూమా ఖురేషి, తమిళ స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా షూటింగ్ లండన్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించనున్న ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News