Wednesday, December 25, 2024

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. మరో వ్యక్తి చెన్నైవాసి అని తెలిసింది. రోడ్డుపై వెళ్తున్న 5 వాహనాలు ఒకేసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌కు చెందిన మృతుల పేర్లు రఘునాథ్, లోకేష్, ఫరూక్ షేక్, కాగా చెన్నై వాసి పేరు దర్శిని వాసుదేవన్ అని నిర్ధారణ అయ్యింది. తెలుగు మృతుల్లో ఒకరు కుకట్‌పల్లి వాసి ఉన్నట్టు సమాచాారం. టెక్సాస్ రాష్ట్రంలోని అన్నెలో శుక్రవారం (ఆగస్టు 30) మధ్యాహ్నం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

బాధితులు కారులో బెంటన్‌విల్లే వైపు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు ఒకేసారి ఢీకొట్టుకున్నాయి. దీంతో ఘోర ప్రమాదానికి దారి తీసింది. మంటలు కూడా చెలరేగాయాయి. యూఎస్ 75వ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతులు ప్రయాణించిన కారు మంటల్లోకి దూసుకెళ్లిందని, బాధితులు లోపల చిక్కుకున్నారని తెలిసింది. మృతుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు, తమవారి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు తల్లిడిల్లిపోతున్నారు. ఇక మృతదేహాలను భారత్‌కు తరలించాలని బాధిత కుటుంబాలు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News