Monday, January 20, 2025

3 ఇడియట్స్ నటుడు అఖిల్ మిశ్రా మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై : 3 ఇడియట్స్ నటుడుగా పాప్యులర్ అయిన అఖిల్ మిశ్రా (67) తన ఇంటి లోని వంటగదిలో జారిపడి తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఆయన బుధవారం సాయంత్రం వంటగదిలో ప్రమాద వశాత్తు జారిపడ్డారని ఆయన భార్య బెర్నెట్ చెప్పారు. భర్త మరణ సమయంలో బెర్నెట్ హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉన్నారు. ఈ వార్త తెలిసి ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేవరకు ఆయన నిలకడగానే ఉన్నారు.

ఆ తరువాత అంతర్గత రక్తస్రావం తీవ్రం కావడంతో మరణానికి దారి తీసింది. మిశ్రా ఎన్నో సినిమాల్లో టీవీ సీరియల్స్‌లో నటించారు. డాన్, గాంధీ, మై ఫాదర్, ఉత్తరన్, ఉడాన్, శ్రీమాన్ శ్రీమతి వంటి సీరియల్స్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. అమీర్‌ఖాన్ 3 ఇడియట్స్ చిత్రంలో లైబ్రేరియన్ దూబేగా నటించి విశేష ప్రశంసలు అందుకున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. నటుడు మనోజ్ బాజ్‌పాయి తదితర నటులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News