Monday, December 23, 2024

టీమిండియాలో కరోనా కలకలం..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: టీమిండియా జట్టులో మహమ్మారి కరోనా కలకలం రేపింది. దీంతో ఈ నెల ఆరు నుంచి వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు భారత క్రికెటర్లతో పాటు పలువురు సహాయక సిబ్బంది కరోనా బారిన పడినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఓపెనర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం టీమిండియా అహ్మదాబాద్‌లో క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ క్రమంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ముగ్గురు క్రికెటర్లకు కరోనా ఉన్నట్టు తేలింది. అయితే దీనిపై బిసిసిఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

3 Indian players test positive for corona ahead of WI Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News