Monday, January 20, 2025

నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్: మంత్రి అనిత

- Advertisement -
- Advertisement -

ఎపీలో సంచలన సృష్టించిన ముంబై నటి కాదంబ‌రి జత్వానీ కేసుపై మంత్రి అనిత స్పందించారు.ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశామని ఆమె చెప్పారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జత్వానీ కేసులో ఎవరినీ బలిపశువులను చేయడం లేదని.. గత వైసిపి ప్రభుత్వం అధికారులను బలిపశువులను చేశారని విమర్శించారు.

ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. బాధితురాలికి న్యాయం చేస్తామని ఆమె చెప్పారు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపునకు అన్ని రకాల సహకారం అందిస్తామ్నారు. ప్రజల జీవితాలతో ఆడుకునేందుకు వైసీపీ నేతలు కుట్రపన్నారని ఆరోపించారు. మూడు పడవల యజమాని ఒక్కరేనని.. కుట్రతోనే బ్యారేజీ పైకి బోట్లను వదిలారని ఆమె చెప్పారు. బ్యారేజీని దెబ్బ తీసి ప్రజలను చంపాలని చూశారు- మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News