Saturday, June 29, 2024

జమ్ముకశ్మీర్‌లో కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్‌లోని డోడా జిల్లాలో భద్రతా సిబ్బందికి, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ముగ్గురుఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులే ఇటీవల భారత సైన్యంపై కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలం నుంచి భారీస్థాయిలో మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో డోడా, రాజౌరీ ,పూంచ్ ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రవాదుల దాడులు ముమ్మరం కావడంతో బుధవారం ఉదయం భద్రతా దళాలు ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం తెలియడంతో గాలిస్తుండగా, ఎదురెదురు కాల్పులు జరిగాయి. భద్రతా దళాలపై జూన్ 11న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులతోపాటు ఓ పోలీస్ అధికారి తీవ్ర గాయాలపాలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News