Sunday, December 22, 2024

మంచుచరియలలో ముగ్గురు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

కుప్వారా: జమ్మూ కశ్మీర్‌లో మంచుచరియలు విరిగిపడ్డ ఘటనలో ముగ్గురు సైనిక జవాన్లు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం మచ్చిల్ సెక్టార్‌లో జరిగిందని, వీరు మంచుశకలాల కింద సమాధి అయిన విషయం ఆలస్యంగా తెలిసిందని అధికారులు శనివారం తెలిపారు. కుప్వారా జిల్లాలోని మచ్ఛిల్ మంచుశిఖరాల నడుమ సైన్యానికి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్ దళం కాపలా విధులు నిర్వర్తిస్తోంది. ప్రతికూల వాతావరణం తరువాత ఈ ముగ్గురు జవాన్ల జాడ తెలియకుండా పోయింది. దీనితో సహాయక బృందాలు పెద్ద ఎత్తున జరిపిన గాలింపుల తరువాత భౌతికకాయాలను మంచు శకలాల కింద గుర్తించారని అధికారులు తెలిపారు. ఎముకలు కొరికే చలిలో, భారీ హిమపాతాల నడుమ ఇక్కడ సైనికులు ఎప్పుడూ ప్రకృతికి, తమ శరీర ధర్మానికి ఎదురీదే రీతిలో నిలవాల్సి ఉంటుంది.

మంచుచరియల కింద పడటంతో జవాన్లు హైపోథర్మియాకు గురయ్యి, శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దుర్మరణం చెందారని వెల్లడైంది. విధి నిర్వహణ దశలో వీరు బలి అయ్యి అమరులు అయ్యారని, విషాదరీతిలో సమాధి కావల్సి వచ్చిందని కుప్వారా పోలీసు అధికారి సమాచారం వెలువరించారు. ఈ చలికాలంలో ఈ ప్రాంతంలో మంచుభారీగా పడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సరిహద్దు రాదార్ల నిర్వాహక సంస్థ (బిఆర్‌ఒ) అత్యంత క్లిషమైన ఈ మంచు తొలిగింపు పనులకు దిగుతుంది.

3 Jawans Killed after avalanche hit in Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News