- Advertisement -
రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం బీజాపూర్‌సుక్మా జిల్లాల సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు.గాయపడిన భద్రతా సిబ్బందిని మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లలో రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు మంగళవారం బీజాపూర్‌సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని టేకల్ గూడెంలో సెక్యూరిటీ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు.
- Advertisement -