Thursday, December 19, 2024

అనాథాశ్రమంలో విషాహారం తిని ముగ్గురు పిల్లల మృతి

- Advertisement -
- Advertisement -

కోయంబత్తూరు: తమిళనాడులోని తిరుపూరులోగల ఒక అనాథాశ్రమంలో విషాహారం తిని ముగ్గురు పిల్లలు మరణించగా మరో 11 మంది అస్వస్థులై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి అనాథాశ్రమంలోని మగ పిల్లలు భోజనంగా అన్నంలో రసంతోపాటు లడ్డూ తిన్నారని, తిన్న తర్వాత కొందరికి వాంతులు, విరేచనాలు అయ్యాయని గురువారం అధికారులు తెలిపారు. గురువారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత వారి పరిస్థితి క్షీణించిందని, కొందరు స్పృహ తప్పి పడిపోయారని వారు చెప్పారు. అస్వస్థులైన పిల్లలందరినీ వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి తర్వాత తిరుపూరు, అన్వేషిలోని ప్రభుత్వ అసుపత్రులకు మార్చామని అధికారులు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 8, 13 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ముగ్గురు బాలురు మరణించారని, మరో ముగ్గురు పిల్లలకు ఐసియులో చికిత్స అందచేస్తున్నారని వారు చెప్పారు. తిరుపూరు జిల్లా కలెక్టర్ ఎస్ వినీత్ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని వాకబు చేశారు. ప్రాథమిక నివేదికలను బట్టి విషాహారం వల్లే పిల్లలు అనారోగ్యం పాలయ్యారని తెలుస్తోందని, ఆహార శాంపిల్స్‌ను పరీక్షలకు పంపామని ఆయన చెప్పారు. ఈ సంఘటన జరిగిన శ్రీ వివేకానంద అనాథాశ్రమంపై దర్యాప్తు చేస్తున్నామని, దాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులను ప్రశ్నిస్తునామని పోలీసులు తెలిపారు.

3 Kids died with Food Poison in Tamil Nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News