Wednesday, January 22, 2025

రంగారెడ్డిలో విషాద ఘటన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో విషాదం ఘటన చోటుచేసుకుంది. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ రఘురాం నగర్ కాలనీ వద్ద మంగళవారం ఉదయం ఆరు గంటలకు మార్నింగ్ వాక్ కు వెళ్తున్న వారిపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో చిన్నారితోపాటు ఇద్దరు మహిళలు ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన మరో మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News