Tuesday, January 21, 2025

లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బైక్ పై వెళ్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం చిత్తూరు జిల్లాలొని చెర్లోపల్లి వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులను పవన్‌, మంజు, చరణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News