Sunday, December 22, 2024

ప్రేమ పెళ్లి… ముగ్గురి హత్య

- Advertisement -
- Advertisement -

ముజఫర్‌నగర్(యూపి): ప్రేమ పెళ్లిపై ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ముగ్గురి హత్యకు దారి తీసింది. ఫులత్ అనే గ్రామంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఇరువర్గాలు ఒకే కులానికి చెందిన వారే. ఈ ఘర్షణలో మొదట అంకిత్ (25), రోహిత్ (29) అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు హరిమోహన్ (28), రాహుల్ (27) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు.

హరిమోహన్ కుమార్తెను అంకిత్ ప్రేమ పెళ్లి చేసుకోవడం హరిమోహన్ కుటుంబీకులకు ఇష్టపడలేదు. దీంతో అంకిత్, హరిమోహన్ మధ్య ఘర్షణ తలెత్తి హింసాత్మకంగా మారింది. తుపాకీ కాల్పులు చోటు చేసుకోవడంతో మరణాలు, గాయాల పాలవడం సంభవించాయని పోలీస్‌లు చెప్పారు. ఈ ఘర్షణకు సంబంధించి రాజు, మోను, గోవర్ధన్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌పి అభిషేక్ సింగ్ విలేఖరులకు చెప్పారు. పరిస్థితి అదుపులో ఉందని గ్రామంలో పోలీస్ దళాలను మోహరింప చేశామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News