Thursday, December 26, 2024

అబుదాబి ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి

- Advertisement -
- Advertisement -

దుబాయి: యుఎఈ రాజధాని అబుదాబిపై డ్రోన్లతో ఉగ్రవాదులు దాడి జరిపారు. అబుదాబి ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ఈ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఘటనాస్థలంలో డ్రోన్ల శెకలాలను స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు, మరొకరు పాకిస్థాన్ వ్యక్తిగా గుర్తించారు. కాగా, తామే ఈ దాడికి పాల్పడ్డట్లు యెమెన్ హౌతీ తీవ్రవాదులు ప్రకటించారు.

3 Killed after drone attack at Abu Dhabi Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News