Sunday, January 19, 2025

లాహోర్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని లాహోర్‌లో భారీ పేలుడు సంభవించింది. గురువారం మధ్యాహ్నం లాహోర్‌లోని అనార్కలీ మార్కెట్ లో బైక్ పార్కింగ్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ముగ్గురు మృతి చెందగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు బలగాలు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని భద్రతా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

3 Killed after explosion in Lahore’s Anarkali Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News