Wednesday, January 22, 2025

విషాద ఘటన.. మహారాష్ట్రలో లోయలో పడ్డ ప్రైవేటు బస్సు

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రాయ్‌గఢ్ లోని గోన్సే ఘాట్ ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

3 Killed after private bus fell into valley in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News