Friday, December 20, 2024

అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. యునైటెడ్ స్టేట్స్ లాస్ వెగాస్‌లోని నెవాడా యూనివర్సిటీలో ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని లాస్ వెగాస్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News