Monday, December 23, 2024

ఘోర ప్రమాదం.. రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు

- Advertisement -
- Advertisement -

చంఢీఘర్: హర్యానాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్థరాత్రి ఝజ్జర్ జిల్లాలోని కుండ్లీ-మనేసర్- పల్వాల్(కెఎంపి) ఎక్స్ ప్రెస్ వేపై వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలనానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బహదూర్ పూర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

3 Killed and 11 Injured in road accident in Haryana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News