Sunday, April 6, 2025

రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం జోష్ పూర్ ప్రాంతంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో ముగ్గురు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పతల్ గఢ్ నుంచి అంబికపూర్ వెళ్తుండగా జోష్ పూర్ సమీపంలో ఎదురుగా రాంగ్ సైడ్ లో ద్విచక్రవాహనం వచ్చింది. బైక్  ను తప్పించబోయి ఓవర్ టర్న్ చేయడంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరితో పాటు ఒక ప్రయాణికుడు చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని ఎస్ డిఒపి అధికారి మయాంక్ తీవారీ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News