Sunday, April 27, 2025

రెండు డంపర్లు ఢీకొని ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

జంషెడ్‌పూర్ : ఝార్ఖండ్ తూర్పు సింగ్‌భుమ్ జిల్లాలో బుధవారం ఇసుక రవాణా చేస్తున్న ఒక డంపర్ మరొక డంపర్‌ను వెనుక నుంచి ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు వెల్లడించారు. ఘట్సిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫూల్డుంగ్రి సమీపాన జాతీయ రహదారిపై ఇసుక డంపర్ చెడిపోగా, డ్రైవర్, అతని సహాయకుడు దానిని మరమ్మతు చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇసుకతో వస్తున్న మరొక డంపర్ ఆగి ఉన్న డంపర్‌ను వెనుక నుంచి ఢీకొన్నదని, ఈ ప్రమాదంలో ఆ వాహనం డ్రైవర్, మరమ్మతు పనిలో ఉన్న ఇద్దరు దుర్మరణం చెందారని ఘట్సిలా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌కె సింగ్ వివరించారు.
౦౦౦౦౦౦

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News