- Advertisement -
కడప: కడప జిల్లాలోని మైలవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మండలంలోని కర్మలవారిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
3 Killed in Road Accident in Kadapa
- Advertisement -