Monday, December 23, 2024

నారాయణపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

3 Killed in Road Accident in Narayanpet District

నారాయణపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నర్వ మండలంలోని కల్వల్ వద్ద వేగంగా వెళ్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్తలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గద్వాల జోగులాంబ గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

3 Killed in Road Accident in Narayanpet District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News