Monday, January 20, 2025

పల్నాడులో ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలోని పల్నాడులో ఘోర ప్రమాదం జరిగింది. వినుకొండ పసుపులేరు బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం వేగంగా దసూకొచ్చిన ఓ లారీ, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News