పట్టుకున్న ఫ్లయింగ్ స్కాడ్
ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా
మన తెలంగాణ, సిటిబ్యూరో: ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బుధవారం రూ. 3,00,000 నగదు సీజ్ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం రూ. 4,02,03,450 నగదు సీజ్ చేశారు. పోలీస్ అథారటీ ద్వారా రూ. 8,32,26,272 నగదు సీజ్ చేయగా ఇప్పటి వరకు రూ. 61,25,16,535 నగదును సీజ్ చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి నగదు తీసుకుని వెళ్తున్న వారిపై 13 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా ఇప్పటి వరకు 813 కేసులు నమోదు చేశారు.
లైసెన్స్ ఆయుధాలను 6 డిపాజిట్ చేయగా ఇప్పటి వరకు 4,620 డిపాజిట్ చేశారు. సి.ఆర్.పి.సి 22 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 1352 కేసులు నమోదయ్యాయి. బైండోవర్లు 43 కాగా మొత్తం 3,643 చేశారు. నక్కాస్ ఆపరేషన్ 107 ఇప్పటి వరకు 3,902 నక్కాస్ ఆపరేషన్స్ చేశారు. నాన్ బెయిలబుల్ వారంట్ 10 ఇప్పటి వరకు 2,377 నాన్ బెయిలబుల్ వారంట్ కేసులు నమోదు చేశారు. ఎం.సి.సి కింద పబ్లిక్ ప్రాపర్టీస్‌లో బుధవారం 83 వాల్ రైటింగ్ లను తొలగించగా మొత్తం 6,498 వాల్ రైటింగ్ తొలగించారు.
బుధవారం 83 విగ్రహాలు మూసివేయగా మొత్తం ఇప్పటి వరకు 94,367 చేపట్టారు. ప్రైవేట్ ప్రాపర్టీలలో బుధవారం 12 పోస్టర్ తొలగించగా ఇప్పటి వరకు 21,677 పోస్టర్లను తొలగించారు. నేడు 67 విగ్రహాలు మూసివేగా మొత్తం ఇప్పటి వరకు 23,311 చేపట్టారు. అనుమతి లేకుండా 2 సమావేశాలు నిర్వహించగా ఇప్పటివరకు మొత్తం 65 సమావేశాలు నిర్వహించారు.
వాహనాల దుర్వినియోగంలో సనత్ నగర్ ఒకటి, గోషామహల్ ఒక కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం 141 లీటర్లను సీజ్ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా బహదూర్ పురలో రెండు కేసులు నమోదయ్యాయి. స్టాటస్టికల్ సర్వేలేన్స్ టీమ్ ద్వారా ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద లక్ష రూపాయలు సీజ్ చేయగా ఇప్పటి వరకు రూ. 39,99,000 సీజ్ చేశారు.