- Advertisement -
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురెదురు కాల్పులు చోటు చేసుకుని ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ముగ్గురి మావోలపై మొత్తం రూ.30 లక్షల రివార్డు ఉన్నట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లా బహేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని మధ్యప్రదేశ్ హోం మంత్రి సరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. మృతుల్లో డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్ పైన రూ.15 లక్షల రివార్డు ఉండగా, ఏరియా కమాండర్ మనోజ్‌తోపాటు రమే అనే మహిళపై చెరో ఎనిమిది లక్షల నగదు అవార్డు ఉన్నట్టు వివరించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తోన్న ప్రత్యేక దళాలు ఇందులో పాల్గొన్నట్టు హోం మంత్రి వెల్లడించారు.
3 Maoists killed in Madhya Pradesh
- Advertisement -