Friday, December 20, 2024

ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

3 Members dead in ORR Accident

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పెద్ద అంబర్‌పేట్ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను నడిరోడ్డుపై ఆపడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News